నిజంనిప్పులాంటిది

May 22 2023, 09:34

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్

విజయవాడ :

ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ గా ఎన్టీఆర్ ఫాన్స్ అంతా కలిసి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం సింహాద్రిని రీ రిలీజ్ చేసారు. రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, భారీగా ప్రమోషన్స్ తో సినిమాని నిన్న ఆయన బర్త్ డే రోజున విడుదల చేసారు.

రీ రిలీజ్ చిత్రమైనా ఎన్టీఆర్ ఫాన్స్ హంగామాతో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని 1000 థియేటర్స్ లో విడుదలై రికార్డ్ సృష్టించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. అంతటితో పండగ చేసుకుని సంబరపడకుండా సింహాద్రి విడుదలైన థియేటర్స్ లో బాణా సంచా కాల్చి హంగామా చేసారు.

అలా విజయవాడలోని అప్సర థియేటర్ లో ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తూ థియేటర్ లోపలే బాణా సంచా కాల్చడంతో థియేటర్ తగలబడిన ఘటన వైరల్ గా మారింది.

ఫాన్స్ అతి, వారి రచ్చ తో థియేటర్స్ లో పేల్చిన బాణాసంచా వలన థియేటర్ లోకి సీట్స్ కాలిపోయాయి. పోలీస్ లు రంగంలోకి దిగి ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలని అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే థియేటర్ సగం కాలిపోయింది.

ఫాన్స్ ఉత్సాహం కాస్త అత్యుత్సాహంగా మారితే ఇలానే ఉంటుంది. ఎంత రచ్చ చేసినా అదుపుతప్పకూడదు. హద్దు మీరకూడదు.. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత వైల్డ్ గా లేకపోతే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఫాన్స్ కాస్త అదుపులో ఉంటే అందరికి మంచిది...

నిజంనిప్పులాంటిది

May 22 2023, 09:31

ఈ రేంజ్ లో తాగుతున్నారా❓️

రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 మే 1 నుంచి 21 మధ్య రాష్ట్రంలో 4.23 కోట్ల బీర్ సీసాలు అమ్ముడయ్యాయి.

కేవలం బీర్ల విక్రయం ద్వారా ఫ్రభుత్వం రూ. 582.99 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరో రెండు వారాల్లో బీర్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని.. మే చివరి నాటికి బీర్ల విక్రయం రూ.1000 కోట్లు దాటుతుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ రేంజ్ లో తాగుతున్నారా❓️

ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మే నెల ప్రారంభం నుంచి మే 21 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల ద్వారా 35 లక్షల 25వేల 247 కాటన్‌ల బీర్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఈ 21 రోజుల్లో బీర్ల విక్రయాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో రూ.48.14 కోట్ల విలువైన 3 లక్షల 364 కాటన్‌ల బీర్ల విక్రయాలు జరిగడం గమనార్హం.

మే నెల ప్రారంభం నుంచి 21 తేదీ వరకు మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో కాటన్​కు 12 బీర్ల చొప్పున సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ లెక్కన 21 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను మద్యం ప్రియులు ఖాళీ చేశారు. మరో వైపు లిక్కర్ విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1,20,334 కాటన్ల లిక్కర్ సేల్ కాగా.. రూ. 78.42 కోట్ల ఆదాయం వచ్చింది. నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఓవరాల్ గా ఈ 21 రోజుల్లో లిక్కర్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 904.47 కోట్ల ఆదాయం వచ్చింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 17 వరకు 1,01,54,100 బీర్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయి. రోజుకు సగటున 6 లక్షల బీర్ బాటిళ్లను మద్యం ప్రియులు వినియోగిస్తున్నారు. ఈ 17 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 8,46,175 బీర్ కాటన్‌లు అమ్ముడవడం విశేషం

నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:29

హైదరాబాద్లో జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్:

నగరంలో జోరుగా వర్షం పడుతోంది. జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం కొండాపూర్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తోంది.

ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనాలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

భారీగా వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి ఎండవేడిమికి నగరవాసులు అల్లాడిపోయారు. సాయంత్రం ఇలా ఒక్కసారిగా వర్షం కురుస్తుండండతో వారికి కాస్త ఉపశమనం లభించినట్టు అయింది.

ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అయిపోతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు.....

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:27

Nitish- Kejriwal: కేజ్రీవాల్‌తో నీతీశ్‌ భేటీ.. కేంద్రంపై 'రాజ్యసభ ప్లాన్‌'!

దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) నాటికి భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై (Opposition Unity) ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు సాగుతోన్న విషయం తెలిసిందే..

ఈ క్రమంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) ఆదివారం దిల్లీ (Delhi) సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తో భేటీ అయ్యారు.

బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి దిల్లీకి వెళ్లిన నీతీశ్‌.. కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా ఓ 'రాజ్యసభ ప్లాన్‌ (Rajyasabha Plan)'ను నీతీశ్‌ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:25

Crime News: గన్నవరంలో దారుణం.. సగం కాలిన స్థితిలో రెండు మృతదేహాలు..

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం జరిగింది. సగం కాలిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు కలకలం రేపాయి. గన్నవరం మండలం సావరగూడెం సమీపంలోని బుడమేరు కాలువ వద్ద ఉన్న మామిడితోటలో సగం కాలిన స్థితిలో ఉన్న ఇద్దరి మృతదేహాలను ఆదివారం స్థానిక రైతులు గుర్తించారు..

వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.

రెండు మృతదేహాల్లో ఒకరిది స్థానికంగా తిరుగాడే యాచకుడిదిగా గుర్తించినట్టు సీఐ కనకారావు తెలిపారు. మామిడితోట యజమాని ఇతర ప్రాంతంలో ఉండటంతో అక్కడికి వచ్చిన యాచకుడు.. సుమారు వారం రోజుల క్రితం మృతి చెంది ఉంటారని వెల్లడించారు.

ఎండ తీవ్రత కారణంగా మృతదేహం కాలినట్లు మారిందన్నారు. మరో మృతదేహం సుమారు 35 ఏళ్ల వయసున్న వ్యక్తిదిగా గుర్తించామన్నారు.

చేతికి ఉన్న కడియం ఆధారంగా క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు..

నిజంనిప్పులాంటిది

May 21 2023, 18:24

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన..

బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు..

అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు..

అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:54

గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

అమరావతి; ఆంధ్రప్రదేశ్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు..

అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాల్లో వేగం పెంచారు.

ఈ క్రమంలోనే గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఐదు అంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు మూడు అంతస్తులలో పరిపాలన విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:42

Pawan Kalyan: ఎంతమేరకు నెరవేరుస్తారో.. మరో నెల వెయిట్‌ చేస్తాం: పవన్‌ ట్వీట్‌

అమరావతి: అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు..

ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు మోకాలడ్డేలా, కంటితుడుపులా ఉండబోవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ఎంతమేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు జనసేన నిరీక్షిస్తుందని పవన్‌ పేర్కొన్నారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:41

తెలంగాణ గవర్నర్ 2000 నోటు పై ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై:

నేను వేసుకునే కోటు... నా వద్దనున్న నోటు తెలుపే.. కనుక రెండు వేల రూపాయల నోట్ల చెలామణీ రద్దయినా నాకు బాధలేదు’ అంటూ తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చమత్కరించారు.

రిజర్వుబ్యాంక్‌ 2 వేల రూపాయల చెలామణీని రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వుపై ఆమె ఆదివారం వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో ఓ ప్రైవేటు కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న తమిళిసై మీడియాతో మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పకూడదని, పరీక్షలనేవి జీవితంలో భాగం మాత్రమేనని చెప్పారు.

పరీక్షలు రాయలేకపోయినవారిలో పలువురు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగారని, విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులకు ఆత్మరక్షణ సంబంధిత క్రీడలు నేర్పాలని, ఈ విషయమై పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి విద్యాశాఖ మంత్రికి సూచనలు కూడా ఇచ్చానని తెలిపారు.

కేంద్ర పాలిత రాష్ట్రాల గవర్నర్ల అధికారాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ఉత్తర్వు ఢిల్లీ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. పుదుచ్చేరి కి సంబంధించి తనకు ముఖ్యమంత్రికి ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు. ముఖ్యమంత్రి కి తనకు మధ్య విబేధాలు చోటుచేసుకోవాలని మాజీ సీఎం నారాయణాస్వామి ఆశ పడుతున్నారని ఆమె విమర్శించారు.

కాగా 2 వేల రూపాలయ నోట్ల రద్దుపై తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్‌ కనుక ఆమె తెల్లకోటు ధరిస్తుండటాన్ని సూచించేలా ఈ వ్యాఖ్యను చేశారు. కోటు మాత్రమే కాదు తన నోటు తెలుపేనంటూ తన వద్ద ఎలాంటి నల్లధనం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు విలేకరులకు నవ్వుపుట్టించాయి

నిజంనిప్పులాంటిది

May 21 2023, 12:39

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లా :

మెదక్‌ జిల్లాలోని నార్సింగ్‌ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది.

దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు.

మృతులను తండ్రీ కొడుకులైన శేఖర్‌, యశ్వంత్‌ (9), దంపతులు బాలనర్సయ్య, మణెమ్మగా, గాయపడినవారిని కవిత, అవినాశ్‌గా గుర్తించారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందినవారిగా గుర్తించారు.

కామారెడ్డి నుంచి చేగుంటవైపు వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

SB NEWS